……. అని ఈ మధ్య ఎక్కువ సార్లు పాడాల్సి వస్తోంది. అబ్బే రాములవారి మీద భక్తి వల్ల కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం వల్ల. ఈ మాంద్యం వల్ల గాలి వానలో చిక్కుకున్న రాబందుల్లా కంపెనీలు గిల గిల కొట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ వాడు ఏం ప్రకటిస్తాడో అని భయంతో ఎదురుచూడవలసిన పరిస్థితి. నా ప్రాజెక్ట్ కొనే కంపెనీ వాడు “తూచ్…..నా దగ్గర డబ్బుల్లేవోచ్” అని బాంబు పేలుస్తాడేమోనని దిగులు. ఇది చాలదన్నట్టు, ఎవడెంత పనికొస్తాడో పరీక్షలు పెట్టి మరీ తెలుసుకుంటున్నారు. మా వాళ్ళేమో నేను బాగా రాశానంటే నేను బాగా రాశానని కీబోర్డ్లు విరగ్గొట్టి మరీ చెప్పుకుంటున్నారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను కాపాడుతుందని పాడుకుంటున్నా…..