బధ్రపరచినది అభిప్రాయం

పక్కింట్లో పండుగ

మొత్తానికి ఐ.పి.ఎల్. ని భారత్ లో నిర్వహించకూడదని నిర్ణయించారు. కారణమేదైనప్పటికి ఇలాంటి నిర్ణయం వెలువడటం బాధాకరమైన విషయం. క్రికెట్ ని అమితంగా  ఇష్టపడే భారతీయులు ఈ ఐ.పి.ఎల్ కోసం సంవత్సరకాలంగా ఎదురు చూసారు. ఈ నిర్ణయం వాళ్ళందర్నీ బాగా నిరుత్సాహపరిచుంటుంది. ఇప్పుడు ఈ పోటీని ఇంగ్లండులో కానీ సౌతాఫ్రికాలో కానీ నిర్వహిస్తార్ట. బి.సి.సి.ఐ. అంటే పడని ఇంగ్లండు బోర్డ్ ఇప్పుడు దీన్ని నిర్వహించటానికి ఉవ్విళ్ళూర్తోందని వార్తల్లో చదివాను. “డబ్బుకు లోకం దాసోహం” అంటే ఇదే కాబోలు.

ఇక మన దేశంలో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆటగాళ్ళకి రక్షణ కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని  ముందే ఊహించామని చెప్తున్న బి.సి.సి.ఐ. అందుకు తగిన చర్యలు ముందే చేపట్టుంటే బహుశా భారత్లోనే పోటీ నిర్వహించగలిగే అవకాశం దొరికుండేది. ఇప్పుడు క్రికెట్ విందులేక మాడిపోయేది భారత ప్రేక్షకులే.

వ్యాఖ్యానించండి

బొమ్మలు బాబూ….బొమ్మలు

ఏమో అనుకున్నాకానీ, టపా రాయడం కొంచెం కష్టమే. నా మట్టుకైతే, మొదట టపా వ్రాయాలని అలోచన రావాలి. తర్వాత ఏ విషయం మీద వ్రాయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఆ విషయం మీద నా అలోచనల్ని, అభిప్రాయాల్ని టపా కట్టించాలి. నాకు అభిప్రాయాలే తక్కువ. ఇక ఎక్కడినించి టపా కట్టించను?????

ఈ వారం నేను చూసిన బొమ్మలు:

  • గోల్మాల్: 1979 లో విడుదలైన హాస్యపు బొమ్మ. కానీ నా రూం థియేటర్ లో నిన్నే విడుదలైంది. చూసింతర్వాత ఇన్ని రోజుల వరకు దీని గురించి నాకు ఎందుకు తెలియలేదో అర్థం కావట్లేదు. చాలా రొజుల తర్వాత ఒక మంచి బొమ్మ చూశాననిపించింది. ఆరొగ్యకరమైన హాస్యం అని సినిమా పండితులెప్పుడూ చెప్తుంటారు. ఈ బొమ్మలో అది బహు పుష్కలం.

 

  • క్వాంటం ఆఫ్ సోలేస్: కొచ్చిన్లో చూసిన రెండో బాండ్ బొమ్మ. ఈ బొమ్మ కన్నా ఇంతకుముందు వచ్చిన బాండ్ బొమ్మలే నచ్చాయి. ఈ బొమ్మ అర్థం కావాలంటే దీనికి ముందొచ్చిన కెసీనో రోయాల్ చూడాల్సిందే.

వ్యాఖ్యానించండి

వారాంతపు విసుగు

వారాంతం…..ఇంగ్లీషులో వీకెండ్ అంటే ఇక్కడ పండుగే. మా ఆఫీసులలో లోకల్ (మల్లు) జనాలందరూ వారాంతానికి భలే తయారవుతారు. శుక్రవారం పొద్దున్నే బ్యాగులతో సహా ఆఫీసుకు వచ్చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 నుంచి ఇళ్ళకు వెళ్ళడం మొదలు. అలా సాయంత్రం అయ్యే సరికి ఆఫీసు మొత్తం ఖాళీ…..అలా ఇళ్లకు వెళ్తున్న వాళ్ళని చూస్తూ….నేనెప్పుడలా వెళ్తానో అని నిట్టూరుస్తూ ప్రతి వారం వారాంతానికి  అంకురార్పణ జరుగుతుంది.

వారాంతాల్లో చేయాలనుకునేవి చాలా ఎక్కువగా, చేయబడేవి చాలా తక్కువగా వుంటాయని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాను. కానీ ఈ మధ్య వారాంతాన్ని క్రికెట్ చాలా ఉత్సాహంగా మర్చేస్తోంది. మరి రోజూ పొద్దున్నే ఆడితే ఎలా వుంటుంది చెప్మా. అమ్మో పొద్దున్నే లేవడమా…..నా వల్ల అయ్యేపనేనా????

ట్రింగ్….ట్రింగ్: నేను పొద్దున్నే లేచానా, లేదా, గ్రౌండుకు వెళ్లానా, లేదా అని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఉందా….ఐతే చూస్తూనేవుండండి నిరంతర టపా స్రవంతి……ఇదే టపా.

వ్యాఖ్యానించండి

Follow

Get every new post delivered to your Inbox.