బధ్రపరచినది నిర్ణయం

శెలవులైపోయాయి

శెలవులు ఐపొయాయి. మళ్ళీ ఆఫీస్ కి  వెళ్ళాలి. ఈ వారం రోజులు ఎలా గడిచాయో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహంతో ఏర్పాట్లు చెసుకున్నన్ని రోజులు కుడా ఇంట్లో లేనేమో అనిపిస్తోంది.

మా బాస్ ని ఎంతో చాకచక్యంగా హేండిల్ చెస్తే ఈ వారం రోజుల శెలవు దొరికింది. మళ్ళీ వాడిని ఎలా ఏమార్చాలో అలోచించుకోవాలి. ఇప్పట్నించి ఆ ప్రయత్నాలు మొదలుపెడితే, మరోసారి శెలవు దొరకడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది.

ఈ వారం రోజులు హాయిగా గడచిపోయాయి. ఇంట్లో చక్కగా న్యూ ఇయర్ కి స్వాగతం పలికాను. మిత్రులని కలిశాను. ఆఫీస్ టెన్షన్లను మర్చిపోయాను. అన్నింటికన్నా ముఖ్యంగా కొబ్బరి నూనె వంటలకి చాలా దూరం అయ్యాను.

ఇప్పుడు శెలవులైపోవడంతో మళ్ళీ రోజువారీ పనులు మొదలుపెట్టాలి. నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఈ వారంలో మునిగిందో తేలిందో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు అదీ ఇటువంటి కష్టకాలంలో శెలవు తీసుకున్నందుకు మా డామేజర్, అదేనండీ మేనేజర్ ఎన్ని రకాల డ్యాన్స్/ కుంగ్ఫూ స్టెప్పులు వేస్తాడో చూడాలి.  ఆ స్టెప్పులన్నీ నేర్చుకుని తిరిగి వాడిమీదే వాటిని ప్రయోగించి “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా” అనాలి. ఐనా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఆఫీసు బోర్ కొట్టేస్తుంది. అంతేకదండీ మాష్టారూ……

వ్యాఖ్యానించండి

అలో అలో అలో

టపా లోకానికి నా నమస్కారం. ఇది నా మొదటి టపా.
ఇందులో ఏం రాయాలో తెలియట్లేదు. ఐతే చాలా టపాలు రాయాలని మాత్రం అనుకుంటున్నా.
రోజే చేస్తున్న ప్రాజెక్ట్ ఒక కొలిక్కి రావడంతో కొంచం ఆనందంగా ఉంది, పైగా కొలువులో కొంచం తీరిక దొరికింది. ఐతే మా చందశాసనులు రేపట్నించీ నన్ను వేరే పనిలో పెట్టాలని నిర్ణయించేసుకునుంటారు. ఐనా ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ మందితో ఎక్కువ పని లాగించేయాలని చూస్తుంటారు వాళ్ళు.

ఇక నా టపా గురించి చెప్పాలంటే, ఇందులో నేను ఇక ముందు చేయబోయే ప్రయాణాలు, నా అనుభవాలు, నా భావాలు అన్ని పెట్టాలనుకుంటున్నా. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నా దినచర్య లా ఉండాలని కోరుకుంటున్నా. చిన్నప్పటినించి దినచర్య ఎప్పుడూ రాయలేదు, మరి ఇప్పుడన్నా విషయంలో నా వైఖిరి మార్చుకోవాలని ఆశిస్తున్నా.

కేరళలో ఉండడంతో తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం బాగా తగ్గిపోయాయి. టపా వల్ల అవన్నీ అధిగమిస్తానని ఆశిస్తున్నా.

ఇప్పటికింతే సంగతులు

వ్యాఖ్యానించండి

Follow

Get every new post delivered to your Inbox.